ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్‌లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీస్..

తమిళనాడులోని కడలూరు ఎన్ ఎల్‌సి ఇండియా లిమిటెడ్‌లో (NLCIL) గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్ , సివిల్, మైనింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగాలలో మొత్తం 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తులకు చివరితేదీ డిసెంబర్ 21. ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ -2023 స్కోర్ సాధించి ఉండాలి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూతో ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50 వేల నుండి రూ. 1,60,000 చెల్లిస్తారు.