కర్ణాటక మాజీ సిఎం మనవరాలు ఆత్మహత్య
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య (30) అత్మహత్యకు పాల్పడ్డారు. బెంగళూరులోని వసంతనగర్‌లో గల తమ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈమె వృత్తి రీత్యా డాక్టర్. యడియూరప్ప ద్వితీయ కూమార్తె పద్మావతి కూతురు. సౌందర్యకు 2018లో నీరజ్‌తో వివాహమైంది. నీరజ్ కూడా డాక్టరే. ఈ మెకు 9 నెలల కుమారుడు కూడా ఉన్నాడు.
శుక్రవారం ఉదయం సౌందర్య భర్త నీరజ్ విధులకు వెళ్లిన తర్వాత ఆమె తన కుమారిడితో ఇంట్లోనే ఉన్నారు. అల్పాహారం ఇచ్చేందుకు పనిమనిషి సౌందర్య గది తలుపు ఎంతసేపు కొట్టినా.. తీయకపోయే సరికి నీరజ్‌కు ఫోన్ చేసింది. ఇంటికి చేరుకున్న నీరజ్ సౌందర్య గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి సౌందర్య ఉరికి వేలాడుతూ కన్పించింది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు.