‘ఓజాస్ తేజో యోగా’ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS):  ‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైద‌రాబాద్ డిడి కాల‌నీ లైబ్ర‌రీ హాల్‌లో శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవ (8 మార్చి ) వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంబ‌రాల్లో చీఫ్ గెస్ట్‌గా ప్ర‌ముఖ సైకాల‌జిస్ట్ ఎన్‌. ల‌లిత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ‌హిళ‌లంద‌రికి అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.
ఓజస్ తేజో యోగా విద్యార్థులు శక్తిని మరియు ఆలోచనలను సానుకూల దిశలో మళ్లించడం ద్వారా వారి వ్యక్తిత్వాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో అనేదానిపై ఇంటరాక్టివ్ చర్చను నిర్వహించారు. మ‌హిళ‌లు తమ జీవితాన్ని తమ నియంత్రణలో తీసుకొని ముందుకు సాగాల‌ని సూచించారు. అలాగే స్త్రీల ఆధ్యాత్మిక జ్ఞానోదయం మాత్రమే వారిని వారి కష్టాల నుండి బయటపడేయగ‌ల‌ద‌ని చెప్పారు.

‘ఓజాస్ తేజో యోగా’ ఇనిస్టిట్యూట్ నిర్వ‌హ‌కురాలు, యోగా గురువు వ‌ర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ.. స్వ‌యం కృషితో సాధించ‌లేనిది ఏదీ లేద‌ని మ‌హిళ‌లు సాధికార‌త‌తో ముందుకు వెళ్లినప్పుడే అభివృద్ధి చెందుతార‌ని తెలాపారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లందరికీ మ‌హిళాదినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మహిళలు తమ సొంత ఎదుగుదల, అభివృద్ధి కోసం తమకు తాము సొంతంగా వినూత్న ఆలోచ‌న‌లు చేయాల‌ని కోరారు. మహిళలు ఆరోగ్యంగా ఉండ‌టానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి రోజులో కొంత సమయం కేటాయించాలని తెలిపారు. ప్రస్తుత‌ న‌గ‌ర‌జీవ‌నంలో మహిళలందరికీ రోజువారీ యోగా సాధన ఆవశ్యకతను  వివ‌రించారు.

అలాగే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌లువురు వక్తలు మాట్లాడుతూ.. రోజువారీ యోగా చేయడంలో వారి అనుభవాలపై మాట్లాడారు. కార్యక్రమంలో మహిళలు యోగా యొక్క ఆవ‌శ్య‌క‌త‌ను గురించి చర్చించారు. అలాగే స‌మాజ అభివృద్ధిలో మ‌హిళ‌ల పాత్ర‌పై కూడా చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌మ ప్ర‌తిభ‌ను చాటేలా ప‌లువురు మ‌హిళ‌లు, చిన్నారులు వినూత్నంగా వివిధ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. కొంద‌రు డాన్స్ తో అల‌రిస్తే.. మ‌రికొంద‌రు పాట‌లు పాడారు.

 

మ‌హిళ‌లు అన్నింటా స‌మాన‌మ‌ని చాటి చెప్పేలా త‌మ పాఠ‌వాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఈరోజు మహాశివరాత్రి కావడంతో కార్య‌క్ర‌మంలో శివుడికి సంబంధించిన భజనలు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యోగా విద్యార్థుల‌తో పాటు ప‌లువురు మ‌హిళ‌లు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ లలిత గారికి `ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్` నిర్వాహ‌కులు శాలువా క‌ప్పి మొమెంటోతో సత్కరించారు. అలాగే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప‌లువురు మ‌హిళ‌ల‌కు మెమోంటోలు అంద‌జేశారు.

 

Leave A Reply

Your email address will not be published.