తాత పాడెను మోసి మమకారాన్ని చాటుకున్న మనుమరాళ్లు

నల్లగొండ (CLiC2NEWS): తాత పాడెను మనుమరాళ్లు మోసిన ఘటన నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడె మోస్తారు అలాంటిదితాత మీద ఉన్న ప్రేమతో పాడెను మోశారు మనుమరాళ్లు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన దండంపల్లి లో జరిగింది. దండంపల్లి గ్రామానికి చెందిన అంజయ్యగౌడ్ (70) అనారోగ్యంతో గురువారం మరణించాడు. అతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం జరిగిన అంత్యక్రియల్లో అంజయ్యగౌడ్‌తోపాటు ఆయన సోదరుల మనుమరాళ్లు ఎనిమిది మంది కలిసి పాడె మోసి తాతపై మమకారాన్ని చాటుకున్నారు.