చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించిన మాస్టర్ ప్రజ్ఞానంద

World Chess Champion: యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్‌ను దాటి భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వానాథన్ ఆనంద్‌ను అధిగమించి భారత్ తరపున టాప్ ప్లేయర్‌గా అగ్రస్థానంలోకి ఎగబాకాడు. బుధవారం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)ను ఓడించడంతో ఈ ఘనత సొంతచేసుకున్నాడు. ప్రస్తుతం ఫిడే ర్యాకింగ్స్లో ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11 వ స్థానంలో ఉండగా.. విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో ఉన్నారు. ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ విభాగంతో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు.