గ్రూప్-1 దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగింపు..

హైదరాబాద్ (): గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులకు గుడ్న్యూస్. దరఖాస్తుల గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్-1 పోస్టులకు గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నేటితో గడువు ముగియనుండగా.. మరో రెండు రోజులు గడువును పొడిగించినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది. దీంతో దరఖాస్తు చేసుకోని వారు చేసుకోగలరు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్9వ తేదీన.. మెయిన్స్ అక్టోబర్ 21 నుండి నిర్వహిస్తారు.