గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఖరారు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుండి 12 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఇక ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలిపారు. మొత్తం 503 పోస్టులకుగానూ 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మల్లీ జోన్, రిజర్వేషన్ ప్రకారం 1 50 ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సమాంతర విధానంతో రిజర్వేషన్లు చేపట్టినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.