షెడ్యూల్ ప్ర‌కార‌మే గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్ (CLiC2NEW)S: రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారంమే జ‌ర‌గ‌నున్నాయి. పరీక్ష‌ల‌పై దాఖలైన పిటిష‌న్ల‌ను రాష్ట్ర ఉన్న‌త న్యాయ‌స్థానం కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజ‌న్ బెంచ్ స‌మ‌ర్ధించింది. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఈ నెల 21 నుండి గ్రూప్‌-1 ప్ర‌ధాన ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని తీర్పునిచ్చింది. అభ్య‌ర్థుల‌కు బ‌యోమెట్రిక్ హాజ‌రు త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని కోర్టు ఆదేశించింది.

 

రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హాణ‌కు హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్ జిల్లాల్లో 46 ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌కు 31.383 మంది అభ్య‌ర్థులు హాజ‌రుకానున్నారు.  ఈ నెల 21 నుండి 27వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌కు టిజిపిఎస్‌సి ఏర్పాట్లు చేసింది. అభ్య‌ర్థుల బ‌యోమెట్రిక్ హాజ‌రుకు ప్ర‌త్యేక సిబ్బందిని నియ‌మించామ‌ని అధికారులు వెల్ల‌డించారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు 20వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.