గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ..

హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది అక్టోబర్ 21 నుండి 27వరకు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్స్ షెడ్యూల్‌ను టిజిపిఎస్‌సి కార్యదర్శి నవీన్ కికోలస్ విడుదల చేశారు. ఈ పరీక్షల కేంద్రాలన్నీ హైదరాబాద్‌లోనే ఉంటాయని తెలిపింది. ప్రతి పేపర్ మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రధాన పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలుగా ఉంది. ప్రతి పేపర్‌కు 150 మార్కులు ఉంటాయని .. జనరల్ ఇంగ్లిష్ పేపరు పదోతరగతి స్థాయిలో ఉంటుందని, ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకుల నిర్ధరణలో పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించారు. పరీక్షల పూర్తి స్థాయి సిలబస్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 19న జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ పరిశీలించాలని సూచించారు.