అక్టోబ‌ర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమ్స్..

హైద‌రాబాద్ (CLiC2NEWS):  తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష తేదీ ఖ‌రారైంది. అక్టోబ‌రు 16వ తేదీన ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని టిఎస్‌పిఎస్సి నిర్ణ‌యించింది. రాష్ట్రంలో తొలి గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ కావ‌డంతో భారీగా ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి. డిప్యూటి క‌లెక్ట‌ర్, డిఎస్పి పోస్టులు సాధిస్తే భ‌విష్య‌త్తులో ఐఎఎస్‌, ఐపిఎస్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు పోటీప‌డి రికార్డు స్థాయిలో ద‌ర‌ఖాస్తు చేశారు. గ‌డువు ముగిసే స‌రికి మొత్తం 503 పోస్టుల‌కు గాను 3,80,202 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు స‌గ‌టున 756 మంది చొప్పున పోటీప‌డుతున్నారు. 503 పోస్టుల్లో మ‌హిళ‌ల‌కు 225 రిజ‌ర్వ్ఉ అయ్యాయి. వీటికి 1,51,192 ద‌ర‌ఖాస్తు చేయాగా, ఒక్కో పోస్టుకు స‌గ‌టున 672 మంది పోటీప‌డుతున్నారు. దివ్యాంగుల కేట‌గిరీలో గ‌ల 24 పోస్టుల‌కు 6,105 మంది ద‌ర‌ఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీప‌డుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.