గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు.. 31,382 మంది మెయిన్స్‌కు అర్హత

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆదివారం విడుదల చేసింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షల అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించనున్నారు. తుది కీతో పాటు రిజల్ట్స్‌ను టిజిపిఎస్సి ఒకేసారి విడుదలయ్యాయి. టిజిపిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.