ఎపిలో గ్రూప్-2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/APPSC.jpg)
అమరావతి (CLiC2NEWS): ఎపిలోని నిరుద్యోగులక శుభవార్త. గ్రూప్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించారు. అభ్యర్థుల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఎపిపిఎస్‌సి ప్రకటనలో తెలియజేసింది. ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించింది. కానీ ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 897 పోస్టులకు గత సంవత్సరం డిసెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడింది.