తెలంగాణలో మరోసారి గ్రూప్-2 పరీక్ష వాయిదా..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ పరీక్ష వచ్చే నెల 6,7, తేదీల్లో జరగాల్సి ఉంది. ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ () ప్రకటించింది. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 పరీక్ష ఆగస్టు 29,30 తేదీల్లో జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తర్వాత నవంబర్ 2,3 తేదీల్లో జరగాల్సి ఉండగా.. ఎన్నికలు కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు.