AP: గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 21 నుండి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష ఉంటుందని ఎపిపిఎస్‌సి స్పష్టం చేసింది. మొత్తం 897 పోస్టులలో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లోనే జరగనున్నట్లు ఎపిపిఎస్ ప్రకటనలో పేర్కొంది.