గ్రూప్-4 దరఖాస్తుల గడువు పొడిగింపు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గుడువును పొడిగిస్తున్నట్లు టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. గ్రూప్-4 ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఈ గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుండటంతో నిన్న ఒక్కరోజులో 58,845మంది దరఖాస్తు చేసినట్లు తెలిపారు. సోమవారం మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.