పన్నులు సకాలంలో కట్టే వారికి జిఎస్‌టి మినహాయింపు.. నిర్మాలా సీతారామన్
ఢిల్లీ (CLiC2NEWS): పన్నులు కట్టే వారి కోసం జిఎస్‌టి కౌన్సిల్‌లో అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మాలా సీతారామన్ తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
చిరు వ్యాపారులకు మేలు కలిగేలా నిర్ణయాలు తీసుకున్నామని.. వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను చెల్లించేవారికి మినహాయింపులు ఇస్తామన్నారు.
జిఎస్‌టి సమావేశం గత సంవత్సరం అక్టోబర్‌లో జిరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరగలేదని మంత్రి తెలిపారు. చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయాలున్నాయన్నారు. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్ఆచయని తెలిపారు. సిజిఎస్‌టి చట్టంలో సవరణలక జిఎస్‌టి కౌన్సిల్ ప్రతిపాదించింది. జిఎస్‌టి కట్టేందుకు చివరి తేదీ గడువు పొడిగించినట్లు మంత్రి తెలిపారు.
రైల్వే స్టేషన్‌లలోని ప్లాట్ఫారం టికెట్లు , వెయిటింగ్‌రూమ్, కల్లాక్ రూమ్, బ్యాటరీ కారు సేవలపై జెస్టి తొలగింపు..
అన్ని కార్టన్ బాక్సులపై జిఎస్‌టి 12 శాతానికి తగ్గింపు..
విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ. 20,000 వరకు జిఎస్‌టి మినహాయింపు
స్ప్రింకర్లపై జిఎస్‌టి 12 శాతానికి తగ్గింపు
అన్ని రకాల సోలార్ కుక్కర్‌లపై 12 శాతం జిఎస్‌టి.