రుణమాఫీకి నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు.. సిఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీ (CLiC2NEWS): మరో నాలుగు రోజుల్లో రైతుల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని.. ఇందుకు రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు ఇతర పథకాలపై దృష్టి పెడతామన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన అనంతరం తెలంగాణ బడ్జెట్ సమావేశాలుంటాయన్నారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగి ఆర్టిసి లాభాలతో నడుస్తోందన్నారు. ఆర్‌టిసికి ప్రతినెల రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుందని.. రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక భారం ఉన్నా సరే సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రం రూ. 7లక్షల కోట్ల అప్పులో ఉందని.. ప్రతి నెల రూ. 7వేల కోట్ల అప్పులు కడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 7 నుండి 11 శాతానికి వడ్డీతో రుణాలు తెచ్చారన్నారు. రాష్ట్రం విడిపోయినపుటు నెలకు రూ. 6,500 కోట్లు కట్టేవారన్నారు. రుణభారం తగ్గంచుకునే దిశలో ఉన్నామని .. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్‌కు ముందే రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కేంద్రం దృష్టిలో ఉంచి ఎక్కువ నిధులు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు సిఎం తెలిపారు.