ఎపిలో టీచర్ల బదిలీలకు మార్గదర్శకాలు జారీ..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. జెడ్‌పి, ఎంపిపి పాఠశాలల్లోని గ్రేడ్-2, హెడ్ మాస్టర్‌ల సర్వీసు కనీసం 5 సంవత్సరాలు ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. టీచర్ల బదిలీలకు సర్వీసుతో సంబంధం లేదని తెలిపింది. ఈ బదిలీ ప్రక్రియను ఆన్‌లైన్ దరఖాస్తు, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల భర్తీ కోసం బదిలీ ప్రక్రియ చేపట్టింది. 3 నుండి 10వ తరగతి వరకు మొత్తం 7,928 సబ్జెక్టు టీచర్లు అదనంగా అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. దీని కోసం హెడ్‌మాస్టర్ గ్రేడ్-2 సహా టిజిటిల బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 12 నుండి జనవరి 12వ తేదీ వరకు బదిలీ ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Very interesting details you have mentioned, regards for posting. “Strength does not come from physical capacity. It comes from an indomitable will.” by Mohandas Karamchand Gandhi.