పంట‌ల రుణ‌మాఫీకి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల: రాష్ట్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం పంట‌ల రుణ‌మాఫీకి మార్గ‌దర్శ‌కాలు విడుద‌ల చేసింది. కుటుంబానికి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ వ‌ర్తిస్తుంద‌ని వ్య‌వ‌సాయ‌శాఖ తెలిపింది. 2018 డిసెంబ‌ర్ 12 నుండి 2023 డిసెంబ‌ర్ 13 వ‌ర‌కు తీసుకున్న పంట రుణాల‌కు మాత్ర‌మే రుణ‌మాఫీ వ‌ర్తింసుంది. దీనికి రేష‌న్ కార్డు ప్రామాణికం. పంట రుణ‌మాఫీ కోసం ప్ర‌త్యేక వెబ్ పోర్ట‌ల్ ఏర్పాటు చేయ‌నున్నారు. రుణ‌మాఫీ న‌గ‌దు నేరుగా ల‌బ్ధిదారుల రైతు రుణ‌ ఖాతాల్లోనే జ‌మ‌చేయ‌బ‌డుతుంది. ఎస్‌హ‌చ్‌జి, జెఎల్జి, ఆర్ ఎంజి, ఎల్ఇసిఎస్ రుణాల‌కు రీషెడ్యూల్ చేసిన రుణాల‌కు మాఫీ వ‌ర్తించ‌దు.

 

1 Comment
  1. […] పంట‌ల రుణ‌మాఫీకి మార్గ‌ద‌ర్శ‌కాలు వ… […]

Leave A Reply

Your email address will not be published.