గుజ‌రాత్‌లో దూసుకుపోతున్న బిజెపి

గాంధీన‌గ‌ర్ (CLiC2NEWS): గుజ‌రాత్ ఎన్నిక‌ల కౌంటింగ్ ఉత్కంఠ‌గా సాగుతోంది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజ‌రాత్‌లో ఇవాళ (గురువారం) వెలువ‌డుతున్న ఫ‌లితాల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఇక్కడ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 92 మంది స‌భ్యుల సంఖ్యాబ‌లం అవ‌స‌రం.

కాగా ఈనాటి ఫ‌లితాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ 130కి పైగా స్థానాలో విజ‌యం సాధించి దూసుకు వెళ్తోంది. గ‌తంలో బిజెపి నెల‌కొల్పిన రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది.

గ‌త రికార్డుల‌ను ప‌రిశీలిస్తే ..

  • 1995వ సంవ‌త్స‌రంలో 121 స్థానాలు కైవ‌సం
  • 1998వ సంవ‌త్స‌రంలో 117 స్థానాలు కైవ‌సం
  • 2002వ సంవ‌త్స‌రంలో 127 స్థానాలు కైవ‌సం
  • 2007వ సంవ‌త్స‌రంలో 117 స్థానాలు కైవ‌సం
  • 2012వ సంవ‌త్స‌రంలో 115 స్థానాలు కైవ‌సం
  • 2017వ సంవ‌త్స‌రంలో 99 స్థానాలు కైవ‌సం
  • 2022వ సంవ‌త్స‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వెలువ‌డిన ఫ‌లితాల్లో 130కి పైగా స్థానాల్లో విజ‌యం. ఇంకా ప‌లు స్థానాల్లో లీడ్ లో కొన‌సాగుతోంది.

ఈ ఫ‌లితాల‌తో బిజెపి జోరు త‌గ్గ‌లేద‌ని నిరూపించింది. వ‌రుస‌గా ఏడు సార్లు అధికారం చేప‌ట్టిన ఏకైక పార్టీగా దేశంలో బిజెపి కొత్త రికార్డు నెల‌కొల్పింది. ఈ విజ‌యంతో దేశంలో బిజెపి శ్రేణులు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు మిఠాయి పంచుకొని శుభాకాంక్ష‌లు తెలుపుకొంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.