సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
![](https://clic2news.com/wp-content/uploads/2023/03/JUDGEMENT.jpg)
గుంటూరు (CLiC2NEWS): జిల్లాలోని నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. నాలుగు నెలల గర్బిణిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2022 మే ఒకటో తేదీ అర్ధరాత్రి రేపల్లె రైల్వే స్టేషన్లో పిల్లలతో కలిసి కుంటుంబం నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు.. భర్తతో కావాలని గొడవకు దిగి అతనిని నిర్భంధించి, తన ముందే భార్యపై అత్యాచారనికి ఒడిగట్టారు. ఈ కేసులో గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. వీరిద్దరికి సహకరించిన మూడవ వ్యక్తి మైనర్ కావడంతో తెనాలి పోక్స్ కోర్టులో విచారణ జరుగుతున్నట్లు సమాచారం.