ఎన్ఆర్ఐ అని చెప్పి ఐదు పెళ్లిళ్లు..
గుంటూరు (CLiC2NEWS): అమెరికాలో ఉద్యోగం అంటూ యువతులను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకున్న కర్నాటి సతీశ్ బాబును గుంటూరు దిశ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందకూరు గ్రామానికి చెందిన కర్నాటి సతీశ్ బాబు అమెరికాలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి గుంటూరు రవీంద్రనగర్‌కు చెందిన శ్రీలక్ష్మిని జూన్ 16నవివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రూ. 80 లక్షలు కావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. డబ్బులు ఇవ్వకపోతో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలు ఇంర్నట్లో పెడతానంటూ బెదిరించాడు. సతీశ్‌బాబు ఇతర మహిళలతో చేసిన చాటింగ్ శ్రీలక్ష్యి చూసింది. గతంలో పలువురు మహిళలతో అతడికి వివాహం జరిగినట్లు గుర్తించి.. దిశ పోలీసులను ఆశ్రయించింది.
సతీశ్‌బాబు 2005లో విశాఖపట్నానికి చెందిన శైలజను వివాహం చేసుకున్నాడు. 2014లో అమెరికాలో లావణ్యను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు 2017లో విడాకులు ఇచ్చాడు. ఇదే సంవత్సరం నరసరావుపేటకు చెందిన లక్షమిని మూడో వివాహం చేసుకున్నాడు. 2019లో నెల్లూరుకు చెందిన దివ్యతో నాలుగో వివాహం చేసుకున్నాడు. నిందితుడు సతీశ్‌బాబును, అతని తండ్రి వీరభద్రరావును గురువారం పోలీసులు అరెస్టు చేశారు.