తెలంగాణలో గుంటూరు కారం సినిమా టికెట్ ధర పెంపు..
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/guntur-karam-movie.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ ప్రియులకు సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన మహేశ్‌బాబు నటించిన చిత్రం గుంటూరు కారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో ఫ్రీరిలిజ్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో రూ. 65, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 పెంచుకునేందుకు వీలు కల్పించింది. అంతే కాకుండా బెనిఫిట్షోకి కూడా అనుమతిచ్చింది.
రాష్ట్రంలో మొత్తం 23 ప్రాంతాలలో ఈ నెల 12 ఆర్ధరాత్రి ఒంటి గంట షో ప్రదర్శిస్తారు. జనవరి 12 నుండి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటల షోలను ప్రదర్శించనున్నారు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేశ్‌బాబు కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం చిత్రం ప్రేక్షకులతో అంచనాలను పెంచుతుంది. ఇక శ్రీలీలతో మహేశ్‌బాబు డ్యాన్స్.. మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ సాంగ్‌లతో ఈ నెల 12 వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్నారు.