TS: శాసన మండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ పదవికి ఒకే ఒక్క నామినేషనే రావడంతో గుత్తా ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనమండలి ఛైర్మన్‌గా ఆయన రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలి ఛైర్మన్‌గా ఎన్నికైన గుత్త సుఖేందర్ రెడ్డిని మంత్రులు, కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు.