పొడవైన జుట్టుతో కుర్రాడి గిన్నిస్ రికార్డ్..
లఖ్‌నవూ (CLiC2NEWS): అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా వారికి ధీటుగా జుట్టును పెంచగలరని ఈ కుర్రాడు నిరూపించాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ ఏకంగా నాలుగడుగుల జుట్టును పెంచుకున్నాడు. సికదీప్ ఒకసారి కూడా జుట్టును కత్తిరించుకోలేదట. ఆ జుట్టే అతనికి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రపంచంలో అతిపొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో చోటు సంపాందించాడు.