ఈ నెల 15 నుండి ఒంటిపూట బడులు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మార్చి 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఇప్పటికే వేడి తీవ్రత ఎక్కువవుతుండడంతో ఈ నెల 15 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం పెట్టి పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.