నమ్మించి.. ఏమార్చి.. ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్ వ్యూహం.

ఇజ్రాయెల్‌పై దాడి: సీక్రెట్ ప్లాన్‌లో లా .. అంతా గోప్యంగా జరిగనట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్, ఐడిఎఫ్ బలగాలను ఏమార్చే వ్యూహాన్ని పక్కా ప్లాన్‌తో అమలు చేసినట్లు హమస్ నాయకుడు వెల్లడించినట్లు మీడియా కథనాల వల్ల తెలుస్తోంది. హమాస్ లోని సీనియర్ కమాండర్లలో అతి కొద్ది మందికి మాత్రమే ఇజ్రాచెల్‌పై దాడి వ్యూహం గురించి తెలుసునని ఆయన తెలిపారు. ఇజ్రాయిల్‌పై పోరాటానికి తాము సిద్ధంగా లేమన్నట్లు గత కొన్ని సంవత్సరాలుగా హమాస్ నుండి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పాలస్తీనా గ్రూపులకు, ఇజ్రాయెల్‌కు మధ్య జరిగిన ఘర్షణల్లో కూడా హమాస్ జోక్యం చేసుకోలేదు. పిఐజె, ఇతర సంస్థలు జరిపిన దాడుల్లోకూడా తలదూర్చలేదు. ఈ విధంగా యుద్ధానికి సిద్దంగా లేనట్లు ఇజ్రాయెల్ దళాలను నమ్మించింది. కేవలం ఆదాయం కోసం ఇజ్రాయెల్‌లో పనిచేసేలా ఎక్కువ పర్మిట్లు సాధించడంపై ఆసక్తి ఉన్నట్లు నమ్మించింది.
ఐడిఎఫ్ బలగాలు ఓ హమాస్ ఉగ్రవాదిని అరెస్టు చేసి ఇంటరేగేషన్ చేయగా.. ఆశక్తి రేపే విషయాలు వెలుగుచూసినవి. దాడికి యత్నిస్తున్నట్లు వారికి కేవలం ఐదు గంటల మందే తెలిసిందని.. ఈ దాడిలో 1000 మంది పాల్గొన్నట్లు తెలిపాడు. వారికి శిక్షణ ఎందుకిస్తున్నారో తెలియదని.. దాడి ప్లాన్ కీలక హమాస్ సభ్యులకు తప్ప మరోకరి తెలియదు. ఇజ్రాయెల్‌లోని కాలనీ వంటి ప్రదేశాలను నిర్మించి అక్కడ దాడి చేయడం నేర్పించారన్నాడు. గాజా యువత ఖాళీ సమయాల్లో ఇలాంటి శిక్షణలో ఉంటారని ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా నమ్మాయి.
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దులో మొత్తం 15 చోట్ల కంచెను కత్తిరించినట్లు తెలిపాడు. ఆప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం లేకపోవడం.. ఆశ్చర్యమేసిందని, తమ సాయుధులు ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 2 గంటల సేపు నడిపించారన్నాడు. అపుడుకూడా ఇజ్రాయెల్ దళాలు కనిపించలేదని ఇంటరాగేషన్ తెలిపాడు.
ఇజ్రాయిల్, గాజా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత.. 5 వేల రాకెట్లతో ఇజ్రాయిల్‌పై దాడి..