మా డైమాండ్ మాకిచ్చేయండి.. ద‌క్షిణాఫ్రికా

జొహెన్నెస్ బ‌ర్గ్‌ (CLiC2NEWS): బ్రిటన్ రాణి ఎలిజ‌బెత్-2 ధ‌రించిన కిరీటంలోని వ‌జ్రాలు త‌మ‌వేన‌ని.. వాటిని త‌మ దేశాల‌కు తిరిగి ఇచ్చేయాల‌ని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎలిజ‌బెత్‌-2 రాణి దండంలోని వ‌జ్రం త‌మ‌దేన‌ని.. దానిని గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని పిల‌వ‌బ‌డే క‌ల్లిక‌న్ డైమాండ్ అని, దానిని తిరిగి ఇచ్చేయాల‌ని తాజాగా ద‌క్షిణాఫ్రికా డిమాండ్ చేస్తోంది.  క‌ల్లిన‌స్‌-1గా పిల‌వ‌బ‌డే ఈ 500 క్యారెట్ల డైమండ్ 1905లో ల‌భ్య‌మ‌య్యింద‌ని, దీనిని బ్రిటిష్ రాజ‌కుటుంబానికి ఇవ్వ‌గా దానిని రాణిదండంపై అమ‌ర్చారు. క‌ల్ల‌క‌న్‌ వ‌జ్రాన్ని త‌క్ష‌ణ‌మే ద‌క్షిణాఫ్రికాకు అప్ప‌గించాల‌ని తండుక్సోలో స‌బేలో అనే సామాజిక కార్య‌క‌ర్త సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేశారు.

ప్ర‌స్తుతం  ఈ డైమండ్‌ను ట‌వ‌ర్ ఆఫ్ లండ‌న్‌లో ఉన్న జ్యువెల్ హౌస్‌లో ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచిన‌ట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కాగా ద‌క్షిణాఫ్రికా పార్ల‌మెంట్ స‌భ్యుడు వుయోల్వేతు జుంగులా బ్రిట‌న్ త‌మ వ‌ద్ద నుండి తీసుకెళ్లిన  బంగారం, వ‌జ్రాల‌న్నీ తిరిగి ఇచ్చేయాల‌ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.