అయోధ్యకు ‘హనుమాన్’ మూవి విరాళం 2.66 కోట్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): హనుమాన్ మూవి టికెట్‌పై రూ. 5 చొప్పున అయోధ్య రామ మందిరానికి విరాళం ఇస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అక్షరాల రూ. 2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడు పోయాయని .. ఈ మొత్తాన్ని హనుమాన్ ఫర్ శ్రీరామ్ అని పేర్కొంటూ వివారాలను వెల్లడించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ సంక్రాంతి విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.