నా తమ్ముడైనందుకు గర్వంగా ఉంది: చిరంజీవి
పవన్‌కు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్ (CLiC2NEWS): పవర్ స్టార్, జనసే అధినేత పవన్ కల్యాన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజును అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలు సినీ నిర్మాణ సంస్థలు కొత్త సినిమాల అప్‌డేట్స్‌తో విషెస్ తెలుపుతున్నారు. పవన్‌తో తనకున్న అనుబంధాన్ని, గతంలో ఆయనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలువురు శుభాకాంక్షలను పోస్టు చేస్తున్నారు.
“జనహితమే లక్ష్యంగా సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్దించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని, నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు కల్యణ్ బాబూ“ అంటూ చిరంజీవి సోష్ మీడియాలో విషెస్ తెలిపారు.
“పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నాను.“ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు.