అమ్మ పాడిన లాలిపాట, నాన్న నేర్పిన బ్రతుకుబాట..
అమ్మ పాడిన లాలిపాట, నాన్న నేర్పిన బ్రతుకుబాట
అమ్మ చేతి గోరుముద్ద, నాన్న తోటి మధురయాత్ర
అమ్మ కూర్చిన నీతికుసుమాలు, నాన్న పేర్చిన నియమభావాలు
అమ్మ పంచిన ప్రేమ, నాన్న పెంచిన ధీమా
అమ్మ కడుపులో నవమాసాలు,నాన్న భుజాలపై నవవసంతాలు
అమ్మంటేనే వరం, నాన్నంటేనే స్వరం
అమ్మంటే అమృతధార, నాన్నంటే మేరునఘధీర
అమ్మంటే అజరామరం, నాన్నంటే నవనందనం
తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలతో
మంజుల పత్తిపాటి.