భిన్న సంస్కృతులకు బహు పునాది..ఉగాది
నూతన ఉత్తేజంతో
చిగురించిన కొత్త ఆశలకు
రంగురంగుల సుమ కుసుమాల
పందిరి వేయగా వచ్చేసింది
తొలి ఉగాది..!
పండిన కొత్త చింత పులుపు, వగరు మామిడి
ఊరింపులు పలుకగా
భిన్నసంస్కృతులకు బహు పునాది
వేస్తూ వచ్చేసింది
తొలి ఉగాది..!
సంస్కృతి సాంప్రదాయలను ఒకటిగా చేసి
చైత్ర మాసపు ఊసులు చెప్తూ
గండు కోయిల తీయని కోయిల పాటలతో
స్వాగతం సుస్వాగతం పలుగాగ వచ్చేసింది
తొలి ఉగాది..!
ప్రకృతి పరవశించగా
పంచభూతాలు దీవించగా
షడ్రురుచుల అభినందనలతో
పంచాంగ శ్రవణంతో
స్వాగతం పలుగగా వచ్చేసింది
తొలి ఉగాది..!
మానవ విలువల పతనం,
అమాయక అమ్మాయిల బ్రతుకులపై
యాసిడ్‌దాడులు, అత్యాచారాలతో
రక్తమొడ్డుతున్న రహదారులు
అంతమొంది…..
ప్రతి ఒక్కరి
జీవన నవగమనానికి
సంతోష వసంతాలనిస్తూ వచ్చే
శ్రీ శుభకృతు నామసంవత్సరానికి
స్వాగతం సుస్వాగతం పలుకుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు ‘ శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.
-మంజుల పత్తిపాటి