నా రాజ్యసభ జీతం వారికే.. హర్భజన్ సింగ్
చండీగఢ్ (CLiC2NEWS): మాజి క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య సభ ఎంపి హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకొచ్చే జీతీన్ని రైతులు కుమార్తెల చదువుల కోసం అందిస్తామని ప్రకటించారు. ఆయన ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం నా వేతనాన్ని వారికి అందించాలని అనుకుంటున్నా, మన దేశ అభివృద్ధికి తోడ్పాడు అందించేందుకు నాకు చేతనైనంత చేస్తాను అని హర్భజన్ ట్వీట్ చేశారు. హర్భజన్ గత నెల పంజాబ్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసినదే.