ఐపిఎల్-2024 సీజన్: ముంబయి జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య..
IPL-2024 (CLiC2NEWS): 2024 ముంబయి జట్టు కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా యాజమాన్యం ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్య గుజరాత్ టైటాన్స్‌ను వీడి.. జట్టులోకి రావడంతోనే అతడికి కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ముంబయి ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మహేల జయవర్దన్ స్పందిస్తూ.. సచిన్ నుండి హర్బజన్ సింగ్, రికిపాంటింగ్ నుండి రోహిత్ శర్మ వరకు ప్రతి ఒక్కరూ తమ నాయకత్వ పటిమను చూపించారన్నారు. ఇపుడు తాజాగా హార్దిక్ వంతు వచ్చిందని.. ఏ మార్పుకైనా ముంబయి ఇండియన్స్ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ సందర్బంగా హార్దిక్ నాయకత్వంలో ఐపిఎల్ 2024 సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు అంతా మంచే జరగాలని కోరుతున్నట్లు తెలిపారు. 2013 నుండి ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు.