రేప‌టి నుండి ఒటిటిలో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.. రేప‌టి నుండి ఒటిటిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర టీమ్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా ఆగ‌స్టు 20 నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రానుంది. జ్యోతికృష్ణ‌, క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హిస్టారిక‌ల్ యాక్ష‌న్ చిత్రం ‘హరిహ‌ర వీర‌మ‌ల్లు .. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈచిత్రంలో బాబి డెఓల్, నిధి అగ‌ర్వాల్ , స‌త్య‌రాజ్ , నాజ‌ర్ , సునీల్ త‌దిత‌రులు న‌టించారు. ఈ సిన‌మా రెండు భాగాలుగా తెర‌కెక్కించారు.

Also Read: Hyderabad-Amravati: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Leave A Reply

Your email address will not be published.