శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం

కొలంబొ (CLiC2NEWS): శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమర సూర్య ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతో దేశాధ్యక్షడు అనుకుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. సిరిమావో బండారు నాయకే తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి అమరసూర్య. దేశ అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన ప్రధాని పదవికి రాజీనామా చేయగా.. హరిణి నిమమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఇద్దరు నేతలను క్యబినేట్ మంత్రులుగా నియమించారు. దీంతో అధ్యక్షుడు దిసనాయకే తో పాటు మొత్తం నలుగురితో కూడిన క్యాబినేట్ కొలువుదీరింది. ఆమెకు న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక శాఖ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక శాఖలను కేటాయించారు.