మనమంతా జీతగాళ్లం.. సేవ చేయాల్సిందే: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట (CLiC2NEWS): మనమంతా జీతగాళ్లం , నేనైనా.. నువ్వేనా.. ప్రజలకు జీతగాళ్లం. కాబట్టి మనం సేవ చేయాలి . పేర్లు వేరు కావచ్చు.. ఒకరు ఆశా, ఒకరు ఎఎన్ ఎం, ఒకరు ఎఎంపి, ఒకరు మంత్రి ఏదైనా కావొచ్చు. నాజీతం రూ. 2లక్షలు. స్టాఫ్ నర్సుగా నీ జీతం రూ. 77వేలు. నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి పిహెచ్‌సి నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అక్కడి వైద్య అధికారులతో, సిబ్బందితో మాట్లాడారు. నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. భద్రాచంలలో వైద్యుడు లేకుండానే స్టాఫ్ నర్సు రోజుకు డెలివరీలు చేస్తున్నారు. మనం కూడా నార్మల్ డెలివరీలు చేయాలని సూచించారు. పెద్ద ఆపరేషన్ చేసి, గర్భసంచి తీసే వ్యాపారం చేయొద్దని, దాన్నికూడా బంద్ చేయించాలని, ఆర్థమయ్యేలా చెప్పాల్సిన వాళ్లు మీరేనని సాటి మహిళా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత తీసుకుని ప్రభుత్వవానికి, మీకు మీరు మంచి పేరు తెచ్చుకోవాలని హరీశ్‌రావు సూచించారు.