మహిళా క్రికెట్ జట్టుకు కొత్త సారథిగా హర్మన్ ప్రీత్ కౌర్
ఢిల్లీ (CLiC2NEWS): భారత మహిళల క్రికెట్ టీమ్ కొత్త కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ ఎంపికైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలిరాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్ బరిలో హర్మన్ ప్రీత్ కౌర్‌తో పాటు స్మృతి మంధాన పేరు కూడా ఉంది. కాగా ఇంతకు ముందు అనుభవం ఉన్న హర్మన్ ప్రీత్ వైపే బిసిసిఐ మొగ్గు చూపింది. శ్రీలంకతో టీమిండియా మూడు టి-20 మ్యాచ్‌లు (జూన్ 23, 25, 27)ఆడనుంది. తర్వాత జులై 1 నుండి క్యాండీలో మూడు వన్డేలు (జులై 1, 4, 7) జరగనున్నాయి.