అట‌వీ శాఖ ఉద్యోగుల‌పై దాడిచేస్తే క‌ఠిన చ‌ర్య‌లు: ఎపి డి. సిఎం ప‌వ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): అట‌వీ శాఖ ఉద్యోగుల‌పై దాడి చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఎపి డిప్యూటీ సిఎం, జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హెచ్చరించారు. ప‌ల్నాడు జిల్లాలో అట‌వీ శాఖ ఉద్యోగుల‌పై దాడిని డిప్యూటీ సిఎం ప‌వ‌న్ ఖండించారు. అలాగే వ‌న్య‌ప్రాణుల‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తే ఉపేక్షించేది లేద‌ని తేల్చి చెప్పారు.

అలాగే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ ఇవాల అమెరికా కాన్సుల్ జ‌న‌ర‌ల్ జెన్నిఫ‌ర్ లార‌న్స్ తో భేటీ అయ్యారు. ఈసంద‌ర్భంగా లార‌న్స్ బృందాన్ని ప‌వ‌న్ స‌త్క‌రించారు. అమెరికా వెళ్లే ఎపి విద్యార్థుల‌కు స‌హకారం ఇవ్వాల‌ని ప‌వ‌న్ వారిని కోరారు.

Leave A Reply

Your email address will not be published.