హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కడప (CLiC2NEWS): జిల్లా కోర్టు ఆవరణలోని పోలీస్ కంట్రోల్‌రూంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న (మంగళవారం) రాత్రి పోలీస్ కంట్రోల్ రూం కార్యాలయానికి విధుల నిమిత్తం విజయ్ కుమార్ వచ్చారు. కాగా ఇవాళ (బుధవారం) ఉదయం కోర్టు సిబ్బంది వచ్చి చూసే సరికి విజయ కుమార్ ఫ్యాన్‌కు వేలడుతూ కనిపించారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆరోగ్యకారణాలే ఆత్మహత్యకు కారణాలు అయిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.