పుదీనాతో అద్భుతం..

పుదీనా .. సంస్కృతంలో పుతిహ, హిందీలో పుదీనా, తెలుగులో పుదీనా, లాటిన్ లో మెంతా పైపరేటా లైన్నేయస్.

చక్కని సుగంధభరితమైన మొక్క. బహువార్షిక మొక్క పుదీనా మొక్క. దీనిని భారత దేశంలో అన్ని ప్రాంతాల్లో పండిస్తున్నారు ఆహారంగా అద్వితీయ ఔషధంగా పనికి వచ్చేది పుదీనా. పుదీనా కుటుంబము ఉష్ణవీర్యము, లఘురూక్ష తీక్షణ గుణాలను మరియు కటు విపాకములను కలిగి ఉంటుంది ఇది దీపనము కపవాత సామకము మరియు బల్యము.
ప్రోటీన్లు క్రొవ్వు కార్బోహైడ్రేట్లు, కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ నియాసిన్ ఆగ్జాలిక్ ఆసిడ్ విటమిన్ ఏ విటమిన్ బి1, విటమిన్ బి2 కలవు
పుదీనా పచ్చడి నోటికి రుచిని కలిగిస్తుంది

అజీర్ణం :– పుదీనా ఆకులరసము, నిమ్మరసము మరియు తేనె కలిపి రెండు టీ టేబుల్ స్పూన్లు రోజు మూడుసార్లు ఇచ్చిన అజీర్ణము కడుపు ఉబ్బరము, మార్నింగ్ సిక్నెస్ మరియు క్రిములు హరించబడతాయి

కడుపునొప్పి :- చిన్నపిల్లలు తమ బాధను చెప్పలేరు. వారికి ఏడుపు ఒక్కటే ఆధారము తమ బాధను ఎక్స్‌ప్రెస్‌ చేయటానికి. అజీర్ణం వలన కడుపుబ్బరము వలన చిన్నపిల్లలు బాధపడుతూ ఉంటే పుదీనా ఆకుల రసం మూడు నాలుగు చుక్కలు గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగించిన చక్కని ఉపశమనం పొందుతారు. కడుపునొప్పి తగ్గుతుంది.

ఋతుసూలా మరియు కడుపునొప్పి.. స్త్రీ నెలసరి అయ్యే రోజుల్లో విపరీతమైన కడుపునొప్పికి లోనవుతారు. అలాంటి స్త్రీలు పుదీనాను వేడి నీటిలో వేసి చక్కగా మరిగించి దాన్ని త్రాగిన నొప్పి తగ్గుతుంది. ఇది ఎక్కిళ్ళు అజీర్ణము మరియు జలుబుతో బాధపడు వారికి చక్కని ఉపశమనముగా కలిగిస్తుంది.

గాత్ర మాధుర్యానికి :– పుదీనా ఆకులు మరియు కొద్దిగా ఉప్పును కలిపి వేడి నీటిలో మరిగించి దానిని గార్గిలింగ్ చేసిన గాయకుల కంఠస్వరం పాడుకాకుండా ఉంటుంది. పాట పాటకు మధ్యలో దీనిని త్రాగటం వలన  గొంతు బొంగురు పోకుండా ఉంటుంది.

 గొంతు నొప్పి:– తమలపాకుల్లో పుదీనా (మెంతాల్ ) లవంగా ఇలాచీ కలిపి వేసుకుని నమలి మింగిన గొంతు నొప్పి తగ్గుతుంది.

సండే ఇంట్లో దోస, ఇడ్లీ, వడ, కిచిడి, ఉప్మా చేసుకునేవారు పుదీనా పచ్చడి దానిలో కలిపి తినండి. తిన్న గంటకే అరుగుదల అవుతుంది. గ్యాస్,ఏసీడీటీ రాదు.

-షేక్. బహార్ అలీ

ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.