తెల్ల మద్ది (ధవళ, అర్జున) చెట్టు..

తెలుగులో తెల్ల మద్ది చెట్టు
సంస్కృతంలో ధవళ, అర్జున చెట్టు
హిందీలో అర్జున చెట్టు అంటారు. దీని గురించి తెలుసుకుందాం.

ఇది ఎక్కువగా రహదారుల, పక్కన, నదుల పక్కన, పర్వతప్రాంతాల్లో, అడవుల్లో చక్కగా ఇది 80 అడుగుల వరకు ఎత్తుగా పెరుగుతా ఉంటుంది. పచ్చని చిగుళ్ళతో చక్కగా ఆకుపచ్చగా చెట్టు ఉంటుంది అర్జున వృక్షము ఇది అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది వైశాఖ, జ్యేష్ట మాసాల్లో పూలు పూస్తాయి శీతాకాలంలో కాయలు కాస్తుంది.

దీని బయట స్వరూపం.. దీని ఆకుల మూడు నుంచి ఆరు అంగుళాల పొడవు, ఒకటి రెండు అంగుళాల వెడల్పు ఉంటాయి. ఆకు వెనుక భాగం ఈనెలు కనిపిస్తాయి. ఆకు వెనుక మధ్య సిరకి రెండు ఆకుపచ్చ రంగుల్లో ఉన్న మధురమైన సోష రస గ్రంధులు ఉంటాయి, పుష్పాలు అత్యంత సూక్ష్మంగా శ్వేత వర్ణ హరిత గుచ్చాలు ఏర్పాటై ఉంటాయి. దీని కాండం శ్వేత వర్ణంతో ఉండి నిలుపుగా ఒకటిన్నర అంగుళాల బంధం ఉంది. రక్త వర్ణంలో ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి పాము కుబుసం విడిచినట్టు తానే ఊడి పడిపోతుంది.

ఫలాలు పొడవుగా, అండాకారంలో గదులతో ఉంటాయి ఉబెత్తుగా ఉన్న ఐదు చారలతో కూడిన ఒకటి రెండు అంగుళాల వరకు పొడవు ఉంటాయి ఫలాలలో బీజాలు ఉండవు. అర్జున చెట్టు నుంచి వెలువడే జిగురు స్వచ్ఛంగా బంగారు, బూడిద రంగుల్లో పారదర్శకంగా కనిపిస్తుంది.

అర్జున ఔషధాలు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది..

అర్జున బెరడులో అనేక రకాల రసాయనక పదార్థాలు ఉన్నాయి. సోడియం మెగ్నీషియం అల్యూమినియం ముఖ్యంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం కార్బోనేట్ దాదాపు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గుండె కండరాలలో చాలా సూక్ష్మస్థాయిలో కూడా వెళ్లి బాగా పనిచేస్తుంది.
అర్జున శీతలము, గుండెకు మంచిది, వగరు, మృతము, క్షయ విషం, కఫాన్ని పిత్తాలను నాశనం చేస్తుంది. మధుమేహం, వ్రణాలు తగ్గిస్తుంది. అర్జున గుండె కండరాలకు చక్కని బలాన్ని ఇస్తుంది. గుండె పోషణ క్రియ బాగా జరుగుతుంది. గుండె స్పందన సరిగ్గా జరుగుతుంది బలోపేతం చేస్తుంది. సూక్ష్మ రక్తవాహికల్లో రక్తం సక్రమంగా ప్రవహించేటట్లు చేస్తుంది. గుండెని ఈ విధంగా సమర్థవంతంగా పనిచేసేటట్లు చేస్తుంది.

దీని ఉపయోగాలు..

అర్జున మూల చూర్ణం చేసి మధుర తైలంతో కలిపి వేడి నీటితో పుక్కిలిస్తే నోటిలో పొక్కులు తగ్గుతుంది.

హృదయ స్పందన..

గుండె సాధారణంగా 72 నుంచి 150 వరకు కొట్టుకుంటుంది. ఒక గ్లాసు టమాటా రసంలో ఒక స్పూన్ అర్జున పట్టా(బెర‌డు) చూర్ణం కలిపి క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే హృదయ స్పందన మామూలు అవుతుంది

అర్జున బెరడు బాగా లావు ఉండేదాన్ని తీసుకొని బాగా మెత్తగా దంచి ఒక చెంచాడు మోతాదు మీగడను కలిపి ఒక కప్పు పాలతో పాటు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా సేవిస్తే గుండెకు సంబంధించిన సమస్త వ్యాధులు నివారించబడతాయి.

మధుమేహం..

అర్జున బెరడు, వేప బెరడు, ఉసిరి బెరడు, పసుపు, నీలి కమలం సమభాగాల్లో తీసుకొని 20 గ్రాముల చూర్ణాన్ని 400 మిల్లి మీటర్ల నీటిలో మరిగించి 100 మిల్లీలీటర్లో మిగిలి ఉండగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం సేవిస్తే పిత్త కారణంగా తలెత్తిన మధుమేహము నివారించబడుతుంది

జ్వరం.
అర్జున బెరడుని 40 మిల్లి లీటర్ల కషాయం సేవిస్తే జ్వరం తగ్గుతుంది

వ్రణం..
అర్జున బెరడు కచ్చాపచ్చాగా దంచి దాన్ని కషాయం చేసి దాంతో వ్రణాలు, పుండ్లు కడిగితే విశేషమైన గుణం కనిపిస్తుంది.
దీన్ని వాడాలనుకుంటే ఆయుర్వేద వైద్యం సలహా మేరకు వాడండి. మీరు స్వతహాగా దీన్ని వాడొద్దు. ఇది చాలా చక్కని ఔషధము చాలా గుణవంతమైనది. ఆయుర్వేద వైద్యం సలహాతో దీన్ని వాడుకోవచ్చును.

-షేక్. బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.