దసరా నవరాత్రుల సందర్భంగా `హెల్త్ టిప్స్`

దసరా నవరాత్రుల సందర్బంగా అందరికి “గోల్డెన్ హెల్త్ టిప్స్ దీనిని పిల్లలు, యువకులు, యువతులు, పెద్దవారు, మహిళమహారాణులు, ఆరోగ్యవంతులు, అనారోగ్యులు, బ్రహ్మచారులు, ప్రతిరోజు ఈ పటిష్టమైన ఆరోగ్య నియమాలు తమ జీవితకాలమంతా పాటిస్తే చాలు, ధీర్గాయుష్ గా ఆరోగ్యంవంతులు గా ఉండవచ్చును.

  • 1. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తకాలంలో లేవవాలి. లేవగానే నీటితో చేతులు, ముఖం శుభ్రంగా కడుకోవాలి.. తరువాత నీరు నోటిలో వేసుకుని కుక్కిలించి ఉమ్మివేయాలి. తరువాత కూర్చోని ఒక గ్లాస్ మంచి నీటిని తాగి, తరువాత ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి.
  • 2. తరువాత నిలబడి నీరు తాగితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి.
  • 3. నీరు తాగిన తరువాత కాలకృత్యములు చేసుకోవాలి. దీని వలన పొట్ట శుభ్రంగా మారుతుంది. గ్యాస్, మలబద్ధకం, రోగాలు రావు. కంటికి.. ఒంటికి మంచిది.
  • 4. శుభ్రంగా స్నానం చేసి చక్కని వెలుతురు, గాలి, వచ్చే ప్రదేశాలలో వాకింగ్, యోగ, నమాజ్, ప్రేయర్, మీకు నచ్చిన దేవుడికి ప్రార్ధన చేయండి.
  • 5. శరీరానికి సౌందర్యం కోసం, ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు ఉదయం 7గంటలలోపు 45 నిముషాలు, వ్యాయామము, రన్నింగ్, యోగ, స్కిప్పింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, ఏరోబిక్, వాకింగ్ ఇలాంటివి చేయండి. దీని వ‌ల‌న బీపీ, షుగర్, పొట్ట పెరగటం లాంటివి రావు.
  • 6. వ్యాయామం తరువాత ఒక చోట కూర్చోని నిదానంగా శ్వాసను రెండు ముక్కల నుండి తీసుకొని శ్వాసను నిదానంగా అదే ముక్కుల ద్వారా బయటకు వ‌ద‌లండి.. ఇలా చేయటం వలన స్వచ్ఛమైన గాలి తీసుకోవటం వలన ఊపిరితిత్తులలో వున్న బొగ్గుపులుసు వాయువు బయకి వెళ్లి, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి రక్తం శుద్ధిగా మారుతుంది. దీని వలన కాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు రావు. ఒకవేళ వస్తే అవి తగ్గుతాయి. మెదడు లో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. న్యూరాలజీ జబ్బలు రావు.ఇలా చేస్తే శరీరం తేలికగా ఉంటుంది. మనసు, శరీరం, శక్తివంతగా ఉంటాయి. శరీరం గట్టిపడుతుంది. వర్షాకాలం, శీతకాలం, వేసవి కాలంలో ఆరోగ్యావంతంగా ఉంటాము.

  • 7. స్నానానికి 30 నిమిషాల ముందు శరీరానికి వారానికి ఒకసారి బాడీని ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి.
  • 8. ప్రతిరోజు అల్పాహారం కంటే ముందు నిమ్మరసం, తేనే, లేదా పండ్ల రసాలు, లేదా పాలు తాగాలి.
  • 9. రోగగ్ర‌స్తులైతే టిఫిన్‌లో బార్లీ జావా, రాగి జావా, ఫ్రూట్స్ సలాడ్స్‌, లేదా మీకు నచ్చిన టిఫిన్ చేయాలి.
  • 10. . ఉదయం 8 గంటలకు టిఫిన్ చేస్తే మధ్యాహ్నం 12 గంటలకు లేదా 1 గంట మధ్యలో భోజనం చేయాలి. భోజనానికి అర గంట ముందు కొద్దిగా నీరు తాగాలి. భోజనం మధ్యలో లావుగా ఉన్న‌వారు కొద్దిగా నీరు తాగాలి. అయితే అన్నం తినేటప్పుడు మజ్జిగ, కానీ పండ్ల రసం కానీ తింటూ తాగవచ్చును, నీరు మాత్రం నిషేధం. ఎవ‌రైనా స‌రే అన్నం తిన్న గంట త‌ర్వాత నీరు తాగ‌వ‌లెను.
  • 11. మధ్యాహ్నం భోజనంలో పొట్టు తీయని గోధుమ రొట్టె, ఉడకపెట్టిన, లేదా కూరగా వండిన ఆకు కూరలు, కూరగాయలు, తినాలి. పొట్టుతో కూడిన పప్పు, పండ్ల సలాడ్, బెల్లం లేదా పెరుగుతో ఆహారాన్ని బాగా నమిలి తినాలి. మజ్జిగలో చిటికెడు ఊప్పు, లేదా చిటికెడు మిరియాల చూర్ణం కలిపి తాగండి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేటట్లు నమిలి తినాలి. ఒక ముద్ద అన్నం 25 సార్లు నమిలి తినాలి. భోజనం కడుపు నిండా తినవద్దు. కడుపు సగ భాగం అన్నం, పావు భాగం నీరు, పావు భాగం ఖాళీగా ఉండాలి. అప్పుడే ఆహారం అరుగుదల అవుతుంది.
  • 12. సాయంత్ర సంధ్యకాలంలో కొద్దిగా వ్యాయామం చేసి పండ్లు, పాలు, అవసరాన్ని బట్టి రాత్రి 7 గంటలలోవు ఒక చపాతీ, ఒక కప్ మీల్స్ తినాలి. తేలికగా అరుగుదల అయ్యేటట్లు ఉండాలి.
  • 13. చెడు అలవాట్లు ఉండకూడదు, ఉంటే వాటిని మానివేయండి. మద్యం, గుట్కా, మట్కా, గంజాయి, దూమపానం, మిర్చీలు, బజ్జిలు, మసాలా పదార్థాలు, బజారులో అమ్మే కలుషితమైన రంగు కలిపినా పానియాలు, చెత్త ఫుడ్, స్వీట్, ఐస్ క్రీం, పిజ్జా, బర్గర్, నూడిల్స్, స్నాక్స్, జంక్ ఫుడ్ తినటం వలన కడుపులో విషం తయారు అవుతుంది. దీనితో గ్యాస్, ఏసీడీటీ, మలబద్ధకం, రోగాలు వస్తాయి. వీటిని వదిలివేయండి.
  • 14. చింతపండు, గుడ్లు, మాంసం, వంటి అమ్ల పదార్దాలు, మైదా, శనగ పిండితో చేసిన వస్తువులు తినరాదు. అన్ని రకముల తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, కొద్దిగా కూరలలో ఎల్లిపాయలు, అల్లం, మిరియాలు, కరివేపాకు, పొట్టుతో వున్న ఆహారం, మొలకెత్తిన గింజలు, పసుపు, మెంతులు,తప్పకుండా వాడండి. పరిమితంగా వాడండి.
  • 15. ఎప్పుడైనా ఆహారం తిన్న తరువాత10 నిముషాలు నడవండి , అన్నం తిన్న తరువాత వేసేది ఒకే ఒక ఆసనం “వజ్రాసనం “దీనిని వేయటం వలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
  • 16. రాత్రి త్వరగా అంటే మినిమం 10 గంటలలోపు నిద్రపోండి, తెల్లవారుజామున 4గంటలకు లేవండి. లేవగానే దేవుణ్ణి, లేదా తల్లితండ్రుల పాదాలకు మొక్కండి.

  • 17. రెండు వారాలకు ఒకసారి నిమ్మరసం, నీరు, తేనే కలిపి తాగండి. నీరు ప్రతిరోజు శరీరానికి కాలాన్ని బట్టి ఎంత కావాలో అంతే తాగండి. అధికంగా తాగితే కడుపుబ్బరం, తక్కువగా తాగితే శరీరంలో వున్న విషపదార్దాలు బయటికి పోవు, నిర్జిలీకరణ స్థితి వస్తుంది. మలబద్ధకం వస్తుంది.మూత్ర సంక్రమణ జరుగుతుంది. చర్మం గరుకుబారి ముఖం, చర్మం ముడతలు పడి ముసలి వారిలాగా కనపడుతారు. ఎక్కువగా నీరు తాగితే గుండె, ముత్రాపిండాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి. నీరు ఎక్కువగా కానీ తక్కువగా కానీ తాగరాదు. అవసరమైనపుడు నీరు తప్పకుండా తాగాలి.
  • 18. దీర్ఘ కాలిక రోగాలు ఉంటే వారంలో ఒక్కసారి ఉపవాసం ఉండాలి. (షుగర్ పేషెంట్స్ thappa) ఎనిమా, మట్టి పట్టి, ఉపచారం చేయాలి. ఒకవేళ ఆలా సాధ్యం కాకపోతే రసాహారల మీద ఉండాలి.
  • 19. శారీరకంగా, మానసికగా ఎటువంటి ఒత్తిడి స్థితిలో ఉండరాదు. గడ్డు పరిస్థితి వస్తే మానసికంగా ఎదుర్కోవటానికి ప్రశాంతంగా ఉండాలి. కంగారు పడకుండా ఉండాలి. బాలన్స్డ్ గా ఉండాలి.
  • 20. బ్రహ్మచర్యపాలన చేస్తూ సమాజసేవ కూడా తనకు తోచినంత చేయాలి. వీలైనంత వరకు నీతినిజాయితీతో సంపాదించటం, అందరు సుఖంగా ఉండాలని పాజిటివ్ ఆలోచన కలిగి ఉండాలి
  • 21. పెద్దల పట్ల గౌరవం,ఉండాలి. చిన్నలకు మర్యాద ఇవ్వాలి. సమాజంలో అందరితో కలిసి మెలిసి జీవనం చక్కగా సాగించాలి.
  • 22. అందరు సకుటుంబ సపరివారంగా ఆరోగ్య పరంగా, ఆధ్యాత్మిక పరంగా, సంస్కృతి పరంగా, సంస్కార పరంగా చల్లగా ఉండాలి.

-షేక్.బహర్ అలీ
-ఆయుర్వేద వైద్యుడు.

ఈ సలహాలు నచ్చితే కామెంట్ చేయండి. తప్పులుంటే చెప్పండి, తప్పకుండా వాటిని సారి చేస్తాను.

Leave A Reply

Your email address will not be published.