కాకినాడ: ఏలేరు కాల్వకు భారీగా వరద

కాకినడ(CLiC2NEWS) : ఎపిలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. దీంతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. ఏలేరు జలాశయం నుండి 27వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనివల్ల జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 86 గ్రమాల్లో వరద ముంచెత్తింది. ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. ఎస్ తిమ్మాపురం, గోపాలపట్నం, సుందరాయనపాలెం గ్రామాల వద్ద ఏలేరు కాల్వకు గండి పడడటంతో భారీగా వరద గ్రామాలను ముంచెత్తింది. రాజులపాలెంలో 2 కిలోమీటర్ల మేర రహదారిపై వరద ప్రవహిస్తోంది. గోపాలపట్నం, గొల్లప్రోలు, పిటాపురం మండలాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అధికారులు 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని తరలించారు. ఆర్మీ, ఎన్‌డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు దిగనున్నట్టు సమాచారం.