హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం
మునిగిన ముసారాంబాగ్ వంతెన!
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహిదీపట్నంతోపాటు, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి. జోరువాన ధాటికి ముసారాంబాగ్ వంతెనపైనుంచి మూసీ నీరు ప్రవహిస్తోంది.
గత రెండు మూడు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల భారగా ట్రాఫిక్ జామ్ అయింది.
మరోవైపు రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిబారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చిరించింది.
