హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో రానున్న గంట‌పాటు మోస్తారు నుంచి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. భాగ్య‌న‌గ‌రానికి ఉత్త‌ర, ప‌డ‌మ‌ర వైపు న‌ల్ల‌టి ద‌ట్టమైన మేఘాలు క‌మ్ముకున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. న‌గ‌ర‌వాసులు ఇళ్ల‌లోనే ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. లోత‌ట్టు ప్రాంతాలలో నీటి నిల్వ‌లు ఉండ‌కుండా చూడాల‌ని కింది స్థాయి సిబ్బందికి అదికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అత్య‌వ‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట‌కు రావాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.