హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌..!

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. దీంతో న‌గ‌రవాసులు ఆప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిహెచ్ ఎంసి అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఆదివారం మోస్త‌రు వ‌ర్షం కురిసింది. సంగారెడ్డి, మెద‌క్ జిల్లాల్తో గాలితో కూడిన వ‌ర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌లం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక‌రు మృతి చెందారు. న‌లుగురికి గాయాల‌య్యాయి. పెద్శంక‌రం పేట మండ‌లం రామోజి ప‌ల్లిలో పిడుగుపాటుకు తండ్రీ కుమారుడు మృతి చెందారు.

సోమ‌వారం ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌లో మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తామ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. జిహెచ్ ఎంసి ప‌రిధిలో వ‌ర్షం కార‌ణంగా త‌లెత్తిన ఇబ్బందుల‌పై టోల్ ఫ్రీ నెంబ‌ర్ 040 2111 1111 90001 13667కు స‌మాచారం అందించాల‌ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు తేలిక‌పాటి నుండి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.