ఎపి, తమిళనాడులోని పలుప్రాంతాలకు భారీ వర్ష సూచన
చెన్నై (CLiC2NEWS): ఎపి మరియు తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మండౌస్.. తీవ్ర తుఫానుగా మారి రానున్న కొన్ని గంటల్లో పుదుచ్చేరి, శ్రీహరి కోట మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ తుఫాను కరైకాల్‌కు, చెన్నైకి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాను ఉత్తర తమిళనడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు 65-68 కిలోమీటర్ల వేగంతో వీయనున్నట్లు తెలిపారు. దీంతో ఎపిలోని రాయలసీమ, తమిళనాడులోని చెన్నైలో హెచ్చరికలు జారీ చేశారు. నిన్న రాత్రి నుండే చెన్నైలో మోస్తరు వర్షం కురుస్తోంది.
We’re a group of volunteers and opening a brand new scheme in our community. Your website offered us with useful information to work on. You’ve performed a formidable task and our whole neighborhood will likely be thankful to you.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?