24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతం.. కోస్తాంధ్ర – ఒడిషా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంతో 24 గంటల్లో ఒడిశా, తెలంగాణ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి (8,9తేదీల్లో) తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.