హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తోంది. ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనులపై రహదారులపై వెళ్తున్న వాహనదారులు, బాటసారులు వర్షంలోనే తడుచుకుంటూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటికొచ్చిన ప్రజలు తడిసిముద్దయ్యారు.
ఉదయం నుంచి అక్కడక్కడా కురుస్తున్న వర్షం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. ఈ వర్షంతో రహదారులపై నీరు నిలిచి కార్యాలయాలనుంచి ఇంటికి వెళ్లే హనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు వర్షం కురుస్తున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. నెక్లెస్ రోడ్డులో 15 నిమిషాలు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, హైదర్గూడ, నారాయణ గూడ, హిమాయత్ నగర్, బాగ్‌లింగంపల్లి, లిబర్టీ, బషీర్ బాగ్, లక్డీకాపూల్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, సికింద్రాబాద్, మారేడ్ పల్లి, బేగంపేట, బోయిన్పల్లి. చిలకలగూడ, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, మూసాపేట, అల్విన్ కాలనీ, హైదర్ నగర్, కూకట్ పల్లి, గాజులరామారం, జీడిమెట్లస సుచిత్ర, కొంపల్లి బాలానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
